నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం
ప్రమాదాలు పొంచి ఉన్న స్థలానికి వెళ్లకూడదు
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని దీంతో కాజ్వేల్ వద్ద నీరు సాగుతుందని అక్కడికి ప్రజలు వెళ్లకూడదని ప్రజల ప్రవర్తన ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య అమృనాయక్ తెలిపారు. ఆలేరు కాజ్వే వద్ద మంగళవారం పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ప్రజలకు తగు సూచన చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు గ్రామం పై గ్రామాలలో వర్ష కురవడంతో నీరు ప్రవాహం వచ్చి ఆలేరు చెరువులోకి వచ్చిందని దీంతో అక్కడ మత్తడి పోవడంతో ఆలేరు వద్ద ఉన్న కాజ్వే నుండి నీటి ప్రవాహం సాగుతుందని అన్నారు.
ఇక్కడ చుట్టుపక్క ప్రజలు చాపలు పడుతున్నారని అనుకోకుండా ఒకసారి వరద ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని దీంతో ప్రాణాలు నష్టం జరిగే అవకాశాలు ఉండవచ్చు అని మీరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు చేపలు పట్టేవారు ఆ కాజ్వేవే వద్ద నుండి వచ్చిపోయే ప్రజలు బైక్ దారులు వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రమాదాలు పొంచి ఉన్న స్థలాలకు ప్రజలు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతంలో ఉండాలని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన మేము అందుబాటులో ఉంటామని మీకు సేవ చేయడమే మా లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
మీకు ఏ ఆపద వచ్చినా సంబంధిత శాఖ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు అధికారులు మీకు అన్ని రంగాలుగా అండదండలు అందిస్తారని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కార మార్గం వెళదామని అన్నారు. వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు . నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే నా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES