నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పెద్ద చెరువును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో మొత్తం చెరువులు, కుంటలు కలిపి 37 ఉన్నాయి. అందులో బొమ్మకల్, చిట్యాల, వడ్డెకొత్తపల్లి, కొరిపల్లి చెరువులతో పాటుగా, మరో ఆరు కుంటలు అరుగులు పారుతున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
వర్షం కారణంగా ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతో నడపాలని సూచించారు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంట్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్స్ ముట్టుకోవద్దన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాల్వలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. నదులు, వాగుల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని, అత్యవసరం అయితేనే ఇంట్లో నుండి బయటకు రావాలని సూచించారు. వారి వెంట ఆర్ఐ భూక్యా లష్కర్ ఉన్నారు.
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES