– జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-చేర్యాల : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వర్షాల కారణంగా ఏ ప్రాంతంలోనైనా ప్రజలు అసౌకర్యానికి గురైనచో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు దగ్గరుండి వారిని పర్యవేక్షించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. నదులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు,ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకూడదన్నారు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదని కోరారు.
వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES