- Advertisement -
శాలిగౌరారం ఎస్.ఐ డి. సైదులు
నవతెలంగాణ నకిరేకల్
శాలిగౌరారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు మండల ప్రజలందరూ సహకరించాలని శాలిగౌరారం ఎస్ ఐ డి.సైదులు ప్రజలను కోరారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా స్థానిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు బెల్ట్ షాపుల నిర్వాహకులు నేటి నుండి తమ దుకాణాలను మూసివేయాలని, లేనిపక్షంలో వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -



