కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్ 
నవతెలంగాణ-పాలకుర్తి
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భైరు భార్గవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ గరీబి హటావో పేరుతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత ఇందిరా గాంధీ అని కొనియాడారు. 
ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, పాలకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, జిల్లా నాయకులు భూమా రంగయ్య, బొమ్మగాని భాస్కర్ గౌడ్, నెలమాస రమేష్ గౌడ్, గోనె మహేందర్ రెడ్డి, బైకాని ఐలేష్ యాదవ్, నారగోని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 
                                    