Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్స్వచ్ఛమైన నీరుతోనే సంపూర్ణ ఆరోగ్యం

స్వచ్ఛమైన నీరుతోనే సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -


– ఎల్మేటి అమరేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
:నేటి ఆధునిక కాలంలో ప్రజలు స్వచ్ఛమైన నీరు తాగడంతోనే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాలాపూర్‌లో కుమ్మరి సుధాకర్‌ నూతనంగా నిర్మించిన వాటర్‌ ప్యూరిఫైయర్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఆహార పదార్థం కల్తీ అవుతోందని, అందుకోసం ప్రజలు రసాయనిక పదార్థాలను తీసుకోకుండా సహజ సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌ రెడ్డి, పి. సుదర్శన్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. జంగయ్య, టి.సుధాకర్‌ రెడ్డి, శ్రీశైలం, మహిపాల్‌ రెడ్డి,నరహరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad