Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయం‘ఉచితాల పంపిణీ’పై సుప్రీంకోర్టులో పిటిష‌న్

‘ఉచితాల పంపిణీ’పై సుప్రీంకోర్టులో పిటిష‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉచిత హామీల‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచితాల’ (Freebies) పంపిణీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు నగదు పంపిణీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ₹500 నగదు, మద్యం పంపిణీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, నేరుగా ₹5,000 నగదు ఇస్తామని వాగ్దానం చేయడం సరికాదని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు.

సి.జె.ఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఈ అంశంలో ప్రజా ప్రయోజనం దాగి ఉందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ విషయంపై మరోసారి కోర్టుకు గుర్తు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. ఆ సమయంపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -