Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేషన్ డీలర్ల కు ఐదు నెలల కమీషన్ ఇవ్వాలని తహసీల్దార్ కు వినతిపత్రం

రేషన్ డీలర్ల కు ఐదు నెలల కమీషన్ ఇవ్వాలని తహసీల్దార్ కు వినతిపత్రం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : మండలం లోని రేషన్ డీలర్ల కు ఐదు నెలల కమీషన్ ఇవ్వాలని సోమవారం మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ రఘు కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు 2025 వరకు రావాల్సిన 5 నెలల కమిషన్ ఇప్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు పనిచేస్తూ ఉన్నారని ప్రభుత్వ ఉత్తర్వుల కనుగుణంగా డీలర్లు ఏప్రిల్ 2025, మే నెలల వారీగా బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. ఆ తరువాత జూన్ 2025, జూలై, ఆగస్టు 3 మూడు నెలల ఉచిత బియ్యాన్ని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పంపిణీ చేశామని అన్నారు.ప్రభుత్వం గత ఐదు నెలలుగా డీలర్లకు కమిషన్ విడుదల చేయక ఆర్థికంగా ఇబ్బందులు పట్టుతున్నామని కోరారు. ఏ నెల కమిషన్ ఆ నెలలో డీలర్ల ఖాతాలో జమ చేయని కారణంగా డీలర్లు అప్పుల పాలు అవుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కమిషన్ను వేరువేరుగా కాకుండా, పాత పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమం లో రేషన్ డీలర్ల మండల ఉపాధ్యక్షులు వంశీ కృష్ణ,కోశాధికారి రమేష్,ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad