రెండుతరాల కవిసంగమం సీరీస్ -48
ఈ నెల 10,న సాయంత్రం 6 గం. లకు రెండుతరాల కవిసంగమం సీరీస్ -48 శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్ (రాంకోఠి), హైదరాబాద్‌లో జరుగుతుంది. పాల్గొంటున్న కవులు: వారాల ఆనంద్, హాథీరామ్ సభావట్. చిట్ల ప్రేమ్ కుమార్, మామిడిపల్లి ఇంద్రాణి, విను.
- కవిసంగమం
జూపాక సుభద్రకు ఎం.రషీద్ ఫౌండేషన్(కేరళ) పురస్కారం
సాహిత్యం, సంస్కృతి, సాంఘిక సంస్కరణ, మానవ హక్కుల రంగాల్లో కృషి చేసిన వారికి ప్రదానం చేసే కేరళకు చెందిన ‘ఎం.రషీద్ ఫౌండేషన్ అవార్డు’ ను ఈ ఏడాది అక్టోబర్ ఐదవ తేదీ సాయంత్రం త్రిసూర్ లోని సాహిత్య అకాడమీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో జూపాక సుభద్ర అందుకుంటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి.కె.అబ్దుల్ అజీజ్, బాబీ కున్హుల్, కె.సచ్చిదానందన్, వాల్టర్ ఫెర్నాండెజ్ రషీద్ పాల్గొంటారు.
సాహితీ వార్తలు..
58 నిమిషాల క్రితం
balaji
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)