Tuesday, October 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్

పిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పిడుగు శబ్దానికి జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా ముంచం గిపుట్టు మండలం తోటలామెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు మోహనారావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెలపుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా పడింది. ఈ శబ్దానికి ప్యాంట్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మోహన్ రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -