Tuesday, May 6, 2025
Homeబీజినెస్స్మార్ట్‌ స్పీకర్‌ను ఆవిష్కరించిన ఫోన్‌పే

స్మార్ట్‌ స్పీకర్‌ను ఆవిష్కరించిన ఫోన్‌పే

- Advertisement -

  • సరికొత్త స్మార్ట్‌స్పీకర్‌ 4జి కనెక్టివిటీ, వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం, ఎక్కువ సేపు నిలిచే బ్యాటరీతో వస్తోంది

మర్చంట్ల మారుతున్న వ్యాపార అవసరాలకు తగినట్టు అప్‌గ్రేడ్ చేసిన తన సరికొత్త స్మార్ట్‌స్పీకర్‌ను ఆవిష్కరించామని ఫోన్‌పే నేడు ప్రకటించింది. ఒరిజినల్ స్మార్ట్‌స్పీకర్‌ పునాదులపై నిర్మించిన దీనిని భారతదేశంలోనే తయారు చేయడం గమనార్హం. తాజా అప్‌గ్రేడ్ ఇదివరకటి స్మార్ట్‌స్పీకర్‌లోని పాపులర్ ఫీచర్లను అలాగే కొనసాగిస్తూనే, ముఖ్యమైన మెరుగుదలలను కూడా ప్రవేశపెట్టింది. దీనిపై ఫోన్‌పేలోని మర్చంట్ బిజినెస్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ, “భారతదేశంలో తయారైన మా సరికొత్త స్మార్ట్‌స్పీకర్లను ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. స్థానికంగా ఈ పరికరాలను తయారు చేయడం వల్ల మా మర్చంట్ల నిర్ధిష్ఠ అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్టు ఉత్పత్తులను సిద్ధం చేసే సౌలభ్యతలను మాకు అందిస్తుంది. ఈ స్మార్ట్‌స్పీకర్లు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్థిక సేవలు అంతగా లేని మారుమూల ప్రాంతాలలోని మర్చంట్లకు ఆర్థిక మేళవింపును ప్రోత్సహించడంతో పాటు దేశంలోని డిజిటల్ రూపాంతరంలో భారతీయ తయారీదారులు కూడా అంతర్గత భాగస్వాములయ్యేలా స్థానిక నవ్యావిష్కరణలను ప్రోత్సహిస్తాయి” అని అన్నారు.
ఫోన్‌పే తన స్మార్ట్‌స్పీకర్‌ను 2022లో ఆవిష్కరించింది. తద్వారా వాయిస్ నోటిఫికేషన్లను అందించే ఒక నమ్మకమైన, సౌకర్యవంతమైన పేమెంట్ సొల్యూషన్‌ను తన ఆఫ్‌లైన్ మర్చంట్లకు అందిస్తోంది.వైవిధ్యమైన 21 భాషలలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌స్పీకర్‌లో ప్రముఖ భారతీయ నటుల స్వరంతో కూడిన ఒక సెలిబ్రిటీ వాయిస్ ఫీచర్ కూడా ఉంది. పేమెంట్లు విజయవంతమైనప్పుడు వచ్చే ఈ తక్షణ ఆడియో అలెర్ట్ లు పేమెంట్లను నిర్ధారించుకోవడంకోసం  మర్చంట్లకు SMS చెకింగ్ లేదా యాప్ నోటిఫికేషన్లను చెక్ చేయడంపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గిస్తుంది. ఇది పేమెంట్ అప్ డేట్లకోసం తమ ఫోన్లను నిరంతరం చెక్ చేసుకోకుండా తమ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.   ఈ సరికొత్త ‘మేడిన్ ఇండియా” స్మార్ట్‌స్పీకర్‌ ఇదివరకటి అన్ని ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు కనెక్టివిటీ, విద్యుత్ సామర్థ్యంలలో చెప్పుకోదగిన మెరుగుదలలతో వస్తోంది. ఇది మరింత ఎక్కువ వేగం, నెట్‌వర్క్ విశ్వసనీయత కోసం 4 జి నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటుంది. తాజా వెర్షన్ సుమారు 75 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.బ్యాటరీ మరింత ఎక్కువ కాలం లైఫ్ కలిగి ఉంటుంది.  ఇది కాకుండా, ఎక్కువ శబ్ధం ఉంటున్న వాతావరణంలోనూ ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. కౌంటర్ ప్రదేశాలు అత్యంత రద్దీగా ఉన్నా మర్చంట్లకు వాటిని ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -