నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందుగాల జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటాలకు స్ఫూర్తి పూలే ఆశయాలు, ఆలోచనా విధానం, మహిళలకు విద్యాదానం చేసిన గొప్ప మేధావి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్, సిద్ధరాములు, వినోద్ నాయక్, సాయి కృష్ణ, కొత్తోళ్ల గంగారాం, సుశీల,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే వర్థంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



