నవతెలంగాణ-హైదరాబాద్: శుక్రవారం దుబాయ్ లో అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానశ్రయంలో జరిగిన ఎయిర్ షోలో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) తేజస్ యుద్ధ విమానంలో మంటలు చెలరేగి కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) మృతి చెందారు. నయాన్ష్ హిమాచల్ ప్రదేశ్‌లోని తెహసిల్ నగ్రోటా బాగ్వాన్‌లోని పాటియాల్కర్ గ్రామానికి చెందినవారు. నమాన్ష్ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన భార్య కూడా ఐఎఎఫ్ అధికారిగా పనిచేస్తున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. నమాన్ష్ తండ్రి జగన్నాథ్ స్యాల్ ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశారు. తర్వాత విద్యాశాఖలో పనిచేసి ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.
దుబాయ్ లో జరిగిన ఎయిర్‌షోలో తేజ్ యుద్ధ విమానం కూలి పైలట్ నమాన్ష్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఇలాంటి దు:ఖ సమయంలో మృతుల కుటుంబానికి అండగా నిలుస్తుందని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఐఎఎఫ్ తెలిపింది.
‘తేజస్’ కూలి పైలట్ నయాన్ష్ మృతి..స్వగ్రామంలో విషాద ఛాయలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



