నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. బుధవారం తన నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు విజయన్. 80 ఏండ్ల వయసులోనూ ఉత్సాహంగా ప్రచారం మొదలుపెట్టిన విజయన్ తన రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇది ఏడోసారి. ధర్మదం నుంచి బరిలోకి దిగడం ఇది మూడోసారి. మార్చి 15న వెలువడిన ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజే అధికార పార్టీ సీపీఐ(ఎం) 105మంది అభ్యర్థులను వెల్లడించింది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎలక్షన్ ఫలితాలు వెలువడనున్నాయి.
పినరయి విజయన్ నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



