నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌పై చర్చ జరగాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దేశీయ రైతులకు అన్యాయం చేస్తూ ట్రాప్ డీల్ కుదుర్చుకున్నారని, ట్రంప్‌తో మోడీజీ రాజీపడ్డారని విమర్శించారు. ఈక్రమంలోనే ట్రేడ్ డీల్ పై సుంకాల తగ్గింపులు, జీరో డ్యూటీ వస్తువులు, ఎగుమతులు మొదలైన కేంద్ర మంత్రి పియూష్ గోయోల్ విషయాలను పేర్కొన్నారు.
అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, జీడిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల పండ్లు & కూరగాయలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని రైతులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి స్పష్టంగా చెప్పారు.
భారత్ ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్ & రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు & కొన్ని యంత్రాలపై అమెరికా 18 శాతం సుంకం విధించిందన్నారు.



