Friday, September 26, 2025
E-PAPER
Homeవరంగల్పారదర్శకంగా సాదాబైనామాలను పరిశీలించాలి 

పారదర్శకంగా సాదాబైనామాలను పరిశీలించాలి 

- Advertisement -

స్టేషన్ ఘన్పూర్ ఆర్డిఓ డిఎస్ వెంకన్
ననవతెలంగాణ-పాలకుర్తి
పారదర్శకంగా సాదాబైనమాలను పరిశీలించాలని  స్టేషన్గన్పూర్ ఆర్డిఓ డిఎస్ వెంకన్న అధికారులను ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని అయ్యంగారి పల్లి, బమ్మెర, చెన్నూరు గ్రామాల్లో సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బమ్మెరలో నిర్వహించిన సాదాబైనామాల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డిఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ 2020 అక్టోబర్ నుండి డిసెంబర్ 10 వరకు చేసుకున్న సాదాబైనామాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. సాదా బైనమా దరఖాస్తుదారులకు ఈ అవకాశం వరం లాంటిదని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాదా బైనమాదరఖాస్తులను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించాలని ఆదేశించారు. భూమి అమ్మిన వ్యక్తులు, కొనుగోలు చేసిన వ్యక్తులు పూర్తి పత్రాలతో కూడిన రఫీ డేవిడ్ చూపించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే స్టాంపు డ్యూటీని చెల్లించుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలన సందర్భంగా కొనుగోలు పత్రాలను, డాక్యుమెంట్లను చూపించాలని రైతులకు వివరించారు. కొనుగోలు చేసిన భూముల్లో బోర్లు వేసినా, విద్యుత్ మోటార్లు బిగించిన వాటికి సంబంధించిన అనుమతులను అధికారులకు చూపించాలని సూచించారు. సాదా బైనమాల దరఖాస్తుల పరిశీలన పట్ల రైతులు ఆందోళన చెందరాదని, పరిశీలన సందర్భంగా గ్రామాల్లో అందుబాటులో లేని రైతులు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులను పరిశీలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగేశ్వర చారి, ఆర్ ఐ లు నరసింహ నాయక్, రాకేష్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, యుగంధర్, వెంకటేష్, ఆయా గ్రామాల జిపిఓ లు యాదగిరి, రాము, సువార్త పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -