- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ బ్రెజిల్లో శుక్రవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాపావో డా కానావో విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక చిన్న విమానం, టేకాఫ్ అయిన వెంటనే రన్‌వే చివరన ఉన్న స్తంభాన్ని ఢీకొని, పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసి ఉండటంతో పెను ప్రాణనష్టం తప్పింది. అధికారులు మంటలను అదుపులోకి తెచ్చి, దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



