నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో తృటిలో విమాన ప్రమాదం తప్పింది. రన్‌వే నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే అదుపు తప్పి రన్‌వే పక్కన ఉన్న చెట్లపైకి దూసుకెళ్లింది ఓ ప్రయివేటు జెట్. అదృష్టవశాత్తూ పైలట్లు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం భాగాలు చెట్లలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జెట్‌లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానయాన శాఖ (DGCA) ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రన్‌వేపై అదుపు తప్పి.. పొదలోకి దూసుకెళ్లిన విమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES