Tuesday, February 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..కార్లు ధ్వంసం

రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..కార్లు ధ్వంసం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఓ విమానం అత్యవసరంగా రోడ్డుపై ల్యాండ్ బీభత్సం సృష్టించిన ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్లాంటా నగరానికి ఉత్తరాన ఉన్న గైనెస్‌విల్లేలో ‘హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36’ అనే సింగిల్ ఇంజిన్ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానం అదుపు తప్పుతుండటంతో పైలట్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని రద్దీగా ఉండే రహదారిని రన్‌వేగా భావించి విమానాన్ని దించేందుకు ప్రయత్నించారు. విమానం రోడ్డుపైకి దూసుకొస్తున్న క్రమంలో అక్కడ ప్రయాణిస్తున్న మూడు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా స్థానికులు షాక్‌కు గురయ్యారు. విమానం రెక్కలు, ముందు భాగం కార్లను తాకడంతో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -