Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ జీతాలను ఇప్పించండి

మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ జీతాలను ఇప్పించండి

- Advertisement -

– ప్రజావాణిలో కార్మికులతో కలిసి వినతి
నవతెలంగాణ-వనపర్తి  :  పాన్గల్ స్కీం ( గోపాల్ దీన్నే రిజర్వాయర్) కింద పని చేసే మిషన్ భగీరథ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, చల్లా కంపెనీ కాంట్రాక్టర్లతో ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకున్న పరిస్థితి లేదని, జీతాలు సకాలంలో రాక కుటుంబాలు గడవడం చాలా గగనంగా మారిన పరిస్థితి ఏర్పడిందని, పెండింగ్లో వేతనాలు వెంటనే ఇప్పించాలని సోమవారం ఐ డి ఓ సి హాలులో జిల్లా అదనపు కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మిషన్ భగీరథ స్కీమ్ కింద పని చేస్తే కార్మికులకు మెగా కంపెనీలో ఉన్నవారికి ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. కానీ తమకు మాత్రం ఏడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్న పట్టించుకునే పరిస్థితి లేదని, మెగా కంపెనీలో కార్మికులకు ఒక్కొక్కరికి 12000 రూపాయలు నెలకు వేతనం ఇస్తున్నారని జిల్లా కంపెనీలో పనిచేస్తున్న పాన్గల్ స్కీం కింద ఉన్న మిషన్ తగిత కార్మికులకు మాత్రం 9400 రూపాయలు మాత్రమే ఇచ్చి మిషన్ భగీరథ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి మండ్ల రాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు RN రమేష్ అన్నారు వీరికి పీఎఫ్ కూడా అమలు చేయడం లేదని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న వేడి నీళ్ల వేతనాలను వెంటనే చెల్లించాలని మెగా కంపెనీలో ఇస్తున్నట్టుగా చెల్లా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు 12 వేల రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రాములు నాయకులు లోకనాయుడు చంద్రాయుడు రవి హరీఫ్ వెంకటేష్ వెంకటయ్య కురుమూర్తి నరసింహ నరేష్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad