కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ అనడమే కానీ అమిత్‌షా చర్యలు తీసుకోరు
కాంగ్రెస్, బీజేపీలది అక్రమ సంబంధం :
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం నిస్సిగ్గుగా నడుస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ బీఆర్‌ఎస్వీలో విలీనమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు వందల కోట్ల కాంట్రాక్టును ముఖ్యమంత్రి రేవంత్ కట్టబెడుతుంటే రాహుల్ గాంధీ కళ్లు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో కూడా చదవడం రాని రేవంత్ రెడ్డి, అదే తనకు అస్కార్ అవార్డు అన్నారనీ, ఆయన డిగ్రీ నకిలీ డిగ్రీ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బీజేపీ పెద్దల మద్దతుందే తప్ప తెలంగాణ ప్రజల మద్దతు లేదని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా పతనావస్థకు చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని పీఎం నరేంద్రమోడీ విమర్శించి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలాగా మారిందని అమిత్‌షా విమర్శిస్తారే తప్ప కేంద్ర మంత్రిగా చర్యలు తీసుకోరని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్రానికి సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు క్విడ్ ప్రో కో కింద రూ.1,600 కోట్ల ఫోర్ట్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్ అప్పజెప్పారనీ, ఇదీ రాహుల్ గాంధీకి కనిపించదని తెలిపారు. కేసీఆర్ హయాంలో విద్యారంగంతో పాటు అన్ని రంగాల అభివృద్ధి చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ అనేక హామీలతో విద్యార్థులను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఆఫర్ లెటర్లు ఇచ్చి తానే ఉద్యోగాలిచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పీఎం విమర్శిస్తారు…కేంద్రం స్పందించదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES