Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్ వెళ్లేందుకు ప్రధానికి రెండేళ్లు: ఖర్గే

మణిపూర్ వెళ్లేందుకు ప్రధానికి రెండేళ్లు: ఖర్గే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పోర్చుగల్ నుంచి భారత్ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు పట్టిందని, కానీ హింసతో అట్టుడికిన మణిపూర్​కు వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీకి రెండేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మణిపూర్ అగ్నిజ్వాలల్లో కాలిపోతున్నప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు. రెండు వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 200 మందికి పైగా మరణించారని, 70 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -