నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత జూన్ 2025లో రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విడతలో అర్హత కలిగిన రైతులకు రూ. 2వేలు డబ్బులు పడతాయి. అయితే, ప్రభుత్వం ఇంకా పీఎం కిసాన్ 20వ విడత అధికారిక తేదీని ప్రకటించలేదు. జూన్ మూడో లేదా నాల్గవ వారంలో రైతుల బ్యాంకు ఖాతాలోకి రూ. 2వేలు విడత రావచ్చని భావిస్తున్నారు.
గతంలో, పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది. 9.8 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. వారిలో 2.4 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18వ విడత 2024 అక్టోబర్‌లో, 17వ విడత 2024 జూన్‌లో అందించారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా రైతులకు రూ.6వేలు సాయం అందిస్తుంది. ప్రతి 4 నెలలకు రూ.2వేలకు రైతుల బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
ఎవరు అర్హులంటే?
సాగు భూమి తమ పేరు మీద ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. అయితే, కొన్ని కేటగిరీల రైతులు ఈ పథకాన్ని పొందలేరు.
సంస్థాగత భూస్వాములు : భూమి ట్రస్ట్ లేదా సంస్థ పేరు మీద ఉంటే.. అప్పుడు పథకం ప్రయోజనం పొందలేరు.
ప్రభుత్వ ఉద్యోగులు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు. క్లాస్ IV, మల్టీ టాస్కింగ్ సిబ్బందికి మినహాయింపు
వృత్తి నిపుణులు : రిజిస్టర్డ్ వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, CA మొదలైన వారికి మినహాయింపు.
పన్ను చెల్లింపుదారులు : గత అంచనా సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు ఈ పథకం కిందకు రారు.
మీరు అర్హత కలిగిన రైతు, డాక్యుమెంట్లు సరైనవి అయితే, జూన్ 2025లో వచ్చే 20వ వాయిదాను పొందవచ్చు. నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే డబ్బులు పడతాయి. రైతులు తమ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేసుకోవాలి. అధికారిక పోర్టల్‌లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
రైతులకు బిగ్ అలర్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES