Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం కిసాన్ అప్‌డేట్..రైతుల ఖాతాల్లో డబ్బులు

పీఎం కిసాన్ అప్‌డేట్..రైతుల ఖాతాల్లో డబ్బులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా.. 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి 22వ తేదీన, ఈ నెల చివరి వారంలో ₹2,000 చొప్పున జమ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఫిబ్రవరి 22న వీలు పడకపోతే, మార్చి మొదటి వారంలో హోలీ పండుగ కంటే ముందే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందించే ఈ నిధులను, గత ఏడాది నవంబర్ 19న 21వ విడతగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -