Wednesday, April 30, 2025
Homeజాతీయంసింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..ఎక్స్‌గ్రేషియా ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడకూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img