నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జోర్డాన్ చేరుకున్నారు. అమన్ లోని విమానాశ్రయానికి వచ్చి ఆ దేశ పీఎం జాఫర్ హుస్సేన్ పీఎం మోడీకి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా రెండు రోజులు జోర్డాన్ లో భారత్ ప్రధాని పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం దిశగా మోడీ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా దేశ ప్రయోజనాలకు అనుకూలంగా పలు అంశాలపై చర్చలు సాగించి, ఒప్పందాలు చేసుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఆ దేశ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ పర్యటన తర్వాత ఇథియోపియా చేరుకుంటారు. ఆ దేశంలో రెండు రోజలు (డిసెంబర్ 17,18) పర్యటిస్తారు. అదే విధంగా ఒమన్ కూడా వెళ్లనున్నారు.
జోర్డాన్ చేరుకున్న పీఎం మోడీ
- Advertisement -
- Advertisement -



