నవతెలంగాణ-హైదరాబాద్: మే 9న మాస్కోలో నిర్వహించే రెండవ ప్రపంచ యుద్ధం విక్టరీ డే 80వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ బుధవారం ప్రకటించారు. చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ సహా 20 మంది విదేశీ ప్రతినిధులకు ఆతిధ్యం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు జిన్‌పింగ్ కూడా నిర్థారించారు. ప్రధాని మోడీకి బదులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించవచ్చని స్థానిక మీడియా తెలిపింది. ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌లను రష్యా అధ్యక్షులు పుతిన్ ఆహ్వానించారు.
- Advertisement -