- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కీకి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.
- Advertisement -