Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంనాలుగు కొత్త‌ వందే భార‌త్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించిన పీఎం మోడీ

నాలుగు కొత్త‌ వందే భార‌త్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించిన పీఎం మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడనున్నాయి.

వారణాసి-ఖజురహో: వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక నగరాలను కలుపుకుని వెళ్లుంది.

లక్నో-సహరాన్‌పూర్: ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్‌పూర్‌లను కలుపుతుంది. రూర్కీ ద్వారా హరిద్వార్‌కు కూడా సులభంగా చేరుకోవచ్చు.

ఫిరోజ్‌పూర్-ఢిల్లీ: ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, బటిండా, పాటియాలా వంటి కీలకమైన నగరాలను ఢిల్లీతో కలుపుతుంది.

ఎర్నాకులం–బెంగళూరు: ఎర్నాకులం – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -