Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికాకు భార‌త్‌ను పీఎం మోడీ అమ్మేశాడు: రాహుల్ గాంధీ

అమెరికాకు భార‌త్‌ను పీఎం మోడీ అమ్మేశాడు: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌తో భార‌త్‌ను అమెరికాకు ప్ర‌ధానిమోడీ అమ్మేశాడని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో పార్ల‌మెంట్ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న‌ మాట్లాడారు. ఈ ఒప్పందం ఐదు నెల‌లుగా పెండింగ్‌లో ఉంద‌ని, ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తాజాగా గ‌త రాత్రి మోడీ సంత‌కం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. తీవ్ర ఒత్తిడి మేర‌కే ఆయ‌న డీల్ ను అంగీక‌రించార‌ని తెలిపారు. పీఎం మోడీ ఇమేజ్‌ను పెంచిన వారే నేడు డ్యామాజ్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మొత్తానికి ప్ర‌ధాని మోడీ అమెరికా ప్ర‌తిపాద‌న‌ల‌కు త‌లొగ్గార‌ని విమ‌ర్శించారు. పార్ల‌మెంట్ స‌మావేశంలో రాష్ట్రప‌తి ప్ర‌సంగం ధ‌న్యావాదం తీర్మానంపై త‌న‌ను మాట్లాడ‌కుండా చేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వారిని చూసి న‌రేంద‌ర్ మోడీ భ‌య‌ప‌డ్డార‌ని..ఆదానీ గ్రూప్‌పై అమెరికాలో ఓ కేసు ఉంద‌ని, కానీ వాస్త‌వానికి ఎప్‌స్ట‌న్ ఫైల్స్ రూపంలో మోడీపై బ‌నాయించ‌బ‌డింద‌ని ఆరోపించారు. ఈమేరకు పీఎం మోడీ యూఎస్ ముందు త‌ల‌వంచార‌ని, ఇంకా పెద్దామొత్తంలో ఎప్‌స్ట‌న్ ఫైల్స్ విడుద‌ల కావాల్సి ఉంద‌ని, ఈలోపే భార‌త్ వ‌స్తువుల‌పై సుంకాలు తగ్గించి యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ అంటూ ఆర్భాటం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇరు దేశాల‌మ‌ధ్య జ‌రిగిన ట్రేడ్ డీల్ పై స‌వివ‌రంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -