- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే తాజాగా ఈ పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీస్ కమీషనర్ మీడియాకు వెల్లడించారు. సాయంత్రం 6.52 గంటలకు ఓ వాహనం ఎర్రకోట సమీపంలోని రెడ్ సిగ్నల్ వద్ద వచ్చి ఆగిందని, ఆ వెంటనే పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ క్రమంలో బాంబు పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు వ్యాపించి, అవి పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -


