Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంసోమనాథుడికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు..

సోమనాథుడికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకల్లో భాగంగా ఆయన ఆలయానికి విచ్చేసి, సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని స్వయంగా అభిషేకం, హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, పరిపాలన అధికారులతో ముచ్చటించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ‘శౌర్య యాత్ర’లో ప్రధాని పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో వీరుల గౌరవార్థం ఈ యాత్రను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -