నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రైస్తవ సమాజాలకు ముందస్తు రక్షణ కల్పించాలని, క్రిస్మస్‌ను శాంతియుతంగా జరుపుకునేలా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సిబిసిఐ) అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ ఆండ్రూస్ థాజత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు వీడియోను విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన దృష్టి లోపం ఉన్న మహిళను బిజెపి నాయకురాలు బహిరంగంగా దుర్భాషలాడి, శారీరకంగా వేధించిన వీడియో చూసి సిబిసిఐ ” దిగ్భ్రాంతికి గురైంది” అని ఒక ప్రకటనలో తెలిపింది. క్రైస్తవులపై దాడుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండటం పట్ల ఆండ్రూస్ థాజత్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగ స్ఫూర్తిని తీవ్రంగా గాయపరిచాయని అన్నారు. ద్వేషం మరియు హింసాత్మక చర్యలను తాను నిస్సందేహంగా ఖండిస్తున్నానని, మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పీఎం మోడీ.. క్రైస్తవులకు రక్షణ కల్పించండి: బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



