Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రెజిల్‌లో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

బ్రెజిల్‌లో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని, అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు.

విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు లాంఛనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ సాంప్రదాయ వాయిద్యమైన సాంబా రెగే సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస భారతీయులు అందించిన స్వాగతం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇది చిరస్మరణీయమని ప్రధాని మోడీ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌)వేదికగా పేర్కొన్నారు. తమ మూలాలతో ప్రవాసులు ఎంత బలంగా అనుసంధానమై ఉన్నారో ఇది తెలియజేస్తోందని ఆయన అన్నారు.

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -