నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్ర రెండు రోజుల పర్యటనలో భాగంగా యుకె ప్రధాని కైర్ స్టార్మర్ మంగళవారం ముంబయికి చేరుకున్నారు. నేడు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగే సిఇఓ ఫోరమ్‌కు స్టార్మర్ హాజరుకానున్నారు. దీనితర్వాత స్టార్మర్, ప్రధాని మోడీ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ ఆరవ ఎడిషన్‌కు హాజరు కానున్నారు.కాగా, ప్రధాని మోడీ నేడు ముంబయిలో నేవీ ముంబయి విమానాశ్రయం, ముంబయి మెట్రో – 2 వాటితో సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ -1 ని దాదాపు 19,650 కోట్ల వ్యయతో నిర్మించారు. ముంబయిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన భూగర్భ మెట్రో లైన్ – 3ని నేడు మోడీ ప్రారంభించనున్నారు.గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025 సమావేశంలో దాదాపు 7,500 కంపెనీలు పాల్గొననున్నాయి. భారత్, అంతర్జాతీయ అధికార పరిధికి ప్రాతినిధ్యం వహిస్తున్న 800 మంది పారిశ్రామికవేత్తలు ఈ ఫెస్ట్‌లో పాల్గొనన్నారు.
యుకె ప్రధాని స్టార్మర్‌తో సమావేశం కానున్న ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES