నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.కేఎస్ఆర్ బెంగళూరు-బెళగావి, అమృత్సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రి, అజ్ని (నాగ్‌పూర్)-పుణే రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించనున్నారు.
ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల మధ్య రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి మెట్రోలో వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర ఎల్లో లైన్‌ను ప్రారంభించిన తర్వాత నమ్మ మెట్రో మూడో దశకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.