నవతెలంగాణ-హైదరాబాద్: 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రథమంగా ఘనాలో పర్యటించినున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పీఎం ఢిల్లీ నుంచి ఘనాకు బయల్దేరారు. పర్యటనలో భాగంగా ఆయన రెండు రోజుల్లో ఆ దేశం ఉండనున్నారు.
ఇరుదేశాల మధ్య అభివృద్ధి, సహకారం, విద్య, ఇంధన, రక్షణ, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్చలు జరపనున్నారు. అక్కడ వ్యాక్సిన్ హబ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వనున్నారు. అలాగే ఘనా పార్లమెంట్ నుఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 70 శాతానికి పైగా ఘనా నుంచే వస్తోంది. కాగా.. ప్రస్తుతం ఘనా అధ్యక్షుడిగా ఉన్న జాన్ మహామా 2015లో ఇండియా – ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కోసం భారత్ ను సందర్శించారు. ఘనా ముగిసిన తర్వాత మిగిలిన దేశాలైన ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను ఆయన సందర్శించనున్నారు.