Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంఇథియోపియా పార్ల‌మెంట్‌లో పీఎం మోడీ ప్ర‌సంగం

ఇథియోపియా పార్ల‌మెంట్‌లో పీఎం మోడీ ప్ర‌సంగం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇథియోపియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇథియోపియా ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రశంసించిన ఆయన.. 140 కోట్ల భారతీయ ప్రజల తరఫున స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇరుదేశాల జాతీయ గీతాలు.. ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్నీ, దేశభక్తినీ ప్రేరేపిస్తాయని కొనియాడారు. భారత జాతీయ గేయమైన ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గేయం రెండూ మాతృభూమిని తల్లిగా సూచిస్తాయని మోదీ అభివర్ణించారు.

ఇథియోపియాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో భారతీయ కంపెనీలూ ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా వృద్ధి చేయాలని తాము నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు వాతావరణంతో పాటు స్ఫూర్తినీ పంచుకుంటాయని మోదీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -