Saturday, November 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్ యువ‌త‌కు పీఎం సుశీల కార్కి కీల‌క పిలుపు

నేపాల్ యువ‌త‌కు పీఎం సుశీల కార్కి కీల‌క పిలుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జెన్ జెడ్ ఆందోళ‌న‌ల‌తో నేపాల్‌లో రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఆ దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాను స‌ర్కార్ బ్యాన్ చేయ‌డంతో ఆ దేశ యువ‌త తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీధులోకి వ‌చ్చి భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. త‌క్ష‌ణ‌మే స‌ర్కార్ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ప‌లురోజ‌లుగా చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు హింస‌కు దారితీశాయి. ప్ర‌భుత్వ ఆస్తులను ఆందోళ‌న‌కారులు ధ్వంసం చేశారు. ప‌రిస్థితుల‌ను శాంతింప చేయ‌డానికి ప్ర‌ధాని ప‌ద‌వికీ కేపీ శ‌ర్మ ఓలి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత ఆ దేశ స‌ర్వోన్న‌త‌గా న్యాయ‌మూర్తిగా విధులు నిర్వ‌హించిన సుశీల కార్కి మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హించారు.

తాజాగా మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన మంత్రి సుశీల కార్కి.. నేపాల్ యువ‌త‌కు కీల‌క పిలుపు ఇచ్చారు. రానున్న ఎన్నిక‌ల‌కు యువ‌త స‌న్న‌ద్ధం కావాల‌ని, అందుకు అర్హ‌త గ‌ల యువ‌కులు ఓటు హ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జాస్వామ్య పున‌ర్ నిర్మాణంలో యువ‌త‌ది కీల‌క భాగ‌స్వామ్యమ‌న్నారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ ద్వారా యువ‌త త‌మ క‌ల‌ల‌ను స‌హ‌కారం చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చిలో నేపాల్ వ్యాప్తంగా జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -