- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బౌలర్ యశ్ దయాళ్‌పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, లైంగిక సంబంధం పెట్టుకున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కోవలో తాజాగా రాజస్థాన్‌కు చెందిన మరో అమ్మాయి అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్‌లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు ఈ పేసర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.
- Advertisement -