– హస్తం పార్టీ అనధికారిక సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత
– దాడులు చేస్తే బీసీ ఉద్యమం ఆగదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-బోడుప్పల్: మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో బీసీలపై దాడులకు పాల్పడుతుందని శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. సోమవారం పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కవితకు బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదని నేను చేసిన వాక్యాలు తెలంగాణ సామెతలో భాగమేనని అన్నారు. ఆదివారం తనపై తన మీడియా సంస్థపై కల్వకుంట్ల కవితా మనుషులు విచక్షణ రహితంగా దాడులు చేయడమే కాకుండా తనను చంపే కుట్ర చేశారని అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాన మంత్రిని కలిసి 9 వ షెడ్యూల్డ్ లో పెట్టలని ఎందుకు డిమాండ్ చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ పేరిటా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు మొదలు పెట్టిందని దానికి కల్వకుంట్ల కవిత వంత పడుతుందని ఎద్దేవా చేశారు.తనపై హత్యాయత్నం చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా తిరిగి దాడికి గురైన వారిపైనే కేసులు నమోదు చేయాడం వెనుక పోలీసుల అంతర్యాయేమిటో అర్దం కావాడం లేదు వాపోయారు. తనపై జాగృతి పేరిటా జరిగిన హత్యాయత్నంపై శాసనమండలి చైర్మన్ తో పాటు బీసీ కమీషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు.
హస్తం పార్టీ డైరెక్షన్ లో కల్వకుంట్ల కవితా దాడులు చేస్తుందని బీసీలపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకునే రోజులు పోయాయని ఇప్పుడు బీసీలందరూ సంఘటీతమయ్యారని భవిష్యత్తులో మీకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ సుదాగాని హరిశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.