Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసింగరేణిపై ‘తొలిపలుకు’ పేరుతో విషపు రాతలు:ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

సింగరేణిపై ‘తొలిపలుకు’ పేరుతో విషపు రాతలు:ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..ప్రధానంగా పెట్టుబడులు రాకుండా.. కట్టుకథల విషపు రాతలు.. తొలిపలుకు రాతలు.. తప్పుడు ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కథనాలు రాస్తున్నారు. రోజుకో కథ వండి వారిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఎవరి కోసం కథలు రాశారో అంటూ ఫైర్ అయ్యారు. సైట్ విజిటింగ్ అనేది ఇప్పుడే పెట్టారు… వారు అనుకున్న వారికి ఇవ్వడం కోసమే కండిషన్ పెట్టారు అని రాశారని మండిపడ్డారు. వాళ్ళు రాయడం.. ఇంకొకయాన లేఖ రాశారు.. ఇంకొకయన ఇంకో వైపు నుండి వచ్చారు.. ఏమిటి మీ ముగ్గురు ఉద్దేశం అని భట్టి ప్రశ్నించారు.

సింగరేణి నిర్ణయం మంత్రుల దగ్గరికి రాదు.. అటానమస్ సంస్థ ఇది. మంత్రి మండలి దగ్గరకు కూడా రాదు.. ఇంగితం ఉన్న.. విజ్ఞానం ఉన్న వారు ఇలా రాయరు అని తెలిపారు. హరీష్ లేఖ రాయడం.. కిషన్ రెడ్డి విచారణ చేపట్టడం.. మంచిది అయ్యిందన్నారు. కిషన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. అడ్డగోలుగా ప్రచారం చేసే వాళ్ల బతుకు బయట పడాలని అనుకున్నానని అన్నారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది.. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -