నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్: జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ఉదయం వరకు కొనసాగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయిందని తెలిపారు. పోలీస్ శాఖలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని, సాయిధ బలగాల సంరక్షణలో భద్రపరుస్తారని తెలిపారు.
జిల్లా ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని ఆకర్షించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు వేద పండితుల శాస్త్రక్తాల మధ్య సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకితో ఐదు రౌండ్లని కాల్చి విజయదశమి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం సాయుద పోలీస్ విభాగంలో పనిచేస్తున్న పోలీసు వాహనాల విభాగంలో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్పోర్ట్ టీం, సిబ్బంది పాల్గొన్నారు.