నవతెలంగాణ – కంఠేశ్వర్ : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు, గంజి గేట్ 1 నుండి దేవి రోడ్ వరకు గల దుకాణ సముదాయాల యజమానులతో, తోపుడు బండ్ల యజమానులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో ప్రతి దుకాణ యజమానులు వారి దుకాణాలలోనే వ్యాపారం నిర్వహించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్/ ఫుట్ పాత్ ఆక్రమించవద్దని సూచించారు. వాహనాలను రోడ్ మీద అక్రమ పార్కింగ్ చేయ వద్దని, తోపుడు బండ్లు రోడ్ మీద ఇష్టం వచ్చినట్లు రోడ్ పైన నిలిపి ట్రాఫిక్ జామ్ చేయవద్దని తెలిపారు. దుకాణ యజమానులు వారి యొక్క సామాగ్రి ఫుట్ పాత్ ఆక్రమించడం చేయరాదని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని తెలియజేశారు. ఇట్టి సమావేశములో వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకున్నారు.
దుకాణం, తోపుడు బండ్ల యజమానులతో పోలీసుల సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES