నవతెలంగాణ – బాల్కొండ : బాల్కొండ ఎస్ఐ శైలెందర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని ఓ సంఘ భవనంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ.9,900 నగదు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన పై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ శైలెందర్ మాట్లాడుతూ పేకాట,జూదం వంటి అవాంఛనీయ కార్యకలాపాలు సమాజానికి హానికరమని అన్నారు. ఇలాంటి చర్యల్లో పాల్గొనే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని,ఎవరైనా ఈ విధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..9 మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES