Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాన్సువాడలో 48 గంటల్లోనే హత్య కేసును చేదించిన పోలీసులు

బాన్సువాడలో 48 గంటల్లోనే హత్య కేసును చేదించిన పోలీసులు

- Advertisement -

–  నిందితుడు అరెస్ట్
నవతెలంగాణ –  కామారెడ్డి : బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే చేదించి నిందితుడిన అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా మాట్లాడుతూ సీసీ కెమెరా ఫుటేజ్ సహా సాంకేతిక ఆధారాల ఆధారంగా నేరస్థుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. “చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు” అని ఆయన స్పష్టం చేశారు.

తేదీ 06-02-2026న పిట్లం గ్రామానికి చెందిన కోట సిద్ధులు తన నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద జాతీయ రహదారి – 161 పక్కన రాజేష్ అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  ఆదేశాల మేరకు తన నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పిట్లం ఎస్‌ఐ వెంకట్ రావు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు  సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగించగా, 08-02-2026న పిట్లం శాంతినగర్ కాలనీలో పరారయ్యేందుకు సిద్ధమవుతున్న నిందితుడు ఉత్తరప్రదేశ్ లోని గోరకపూర్ కు చెందిన శ్రీకృష్ణ ( శ్రీ కృశున్ ) ,  ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా రాజేష్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. గతంలో ఇద్దరూ బెంగళూరులో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. పెయింటింగ్ పనుల కోసం పిట్లం గ్రామానికి వచ్చిన తర్వాత డబ్బుల సమస్యలతో వివాదాలు కొనసాగాయని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి మొబైల్ ఫోన్, నగదు, అలాగే మరకలతో ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన సీఐ తిరుపయ్య, ఎస్‌ఐ వెంకట్ రావు, కానిస్టేబుళ్లు రఘు, వెంకటేష్, నవీన్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -