Friday, February 13, 2026
E-PAPER
Homeజిల్లాలుఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ కక్ష సాధింపు తగదు

ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ కక్ష సాధింపు తగదు

- Advertisement -
  • బీఆర్ఎస్ పార్టీ యూత్ వెల్దండ అధ్యక్షుడు జంగిలి యాదగిరి
    నవతెలంగాణ-వెల్దండ: ఫోన్ టాపింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వెల్దండ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల మీద రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతి పక్షమైన బిఆర్ఎస్ పార్టీనీ రాజకీయంగా ఎద‌రుకోలేక‌ ఫోన్ టాపింగ్ సాకుతో రాజకీయ కక్షలకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ తెర‌లేపిందని ఆరోపించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ల‌ను సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఫోన్ టాపింగ్ పేరుతో విచారణకు పిలవడం రాజకీయ కక్ష సాధింపులు భాగమేననన్నారు. ఇకనైనా బ్లాక్ మెలింగ్ రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్,ఎకుల శ్రీను, బర్కం గణేష్, గోరేటి దశరథం,అన్వర్ పాషా, మహేష్ యాదవ్‌లు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -