88.78 శాతం పోలింగ్ నమోదు
అత్యధికంగా మాడుగులపల్లి లో 92.34 శాతం నమోదు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఆదివారం రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. డివిజన్ పరిధిలోని పది మండలాల్లో కలిపి 88.78 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికముగా మాడ్గులపల్లిలో 92.34శాతం మిర్యాలగూడ మండలంలో అత్యాలపంగా 85.79 శాతం పోలింగ్ నమోదు అయింది. మండలాల వారీగా పోలైన ఓట్ల శాతం ఇలా….. అడవిదేవులపల్లి మండలంలో 13915 ఓట్లు ఉండగా 12,687 (91.17) ఓట్లు పోలయ్యాయి.
అనుములలో 20,349 ఓట్ల కు గాను 18,587(91.34) దామరచర్లలో 40313 ఓట్లకు గాను 35898(89.05), మాడ్గులపల్లిలో 24212 ఓట్లకు గాను 19357(92.34) శాతం, మిర్యాలగూడ మండలంలో 53537 ఓట్లకు గాను 45928(85.79), నిడమానూరులో 36094 ఓట్లకు గాను 32075(88.87), పెద్ద వూర 32742 ఓట్లకు గాను 28496(87.03), త్రిపురారం 31763ఓట్ల కు గాను 28124 (88.54), తిరుమలగిరి సాగర్ 26082 ఓట్లకు గాను 23276(82.94) వేములపల్లి 20568 ఓట్లకుగాను 18424 (89.58) ఓట్ల చొప్పున పోలయ్యాయి. మొత్తం 299576 ఓట్ల కు గాను 265852 ఓట్లు పోలవగా సగటున 88.74 ఓటు శాతం నమోదు అయింది. అత్యధికముగా మాడ్గులపల్లి మండలంలో 92.34 అత్యాల్పoగా మిర్యాలగూడ మండలంలో 85.79 శాతం ఓట్లు నమోదు అయ్యాయి.



