నవతెలంగాణ-హైదరాబాద్: స్వచ్ఛభారత్ నగర్‌గా పేరుపొందిన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కాలుష్యత నీరు తాగి పందుల సంఖ్యలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భగీరథ్‌పుర్‌లోని మంచినీటి పైప్‌లైన్‌లో లీకేజీని గుర్తించామని అధికారులు తెలిపారు. మరుగుదొడ్డి నుంచి ఆ పైప్‌లైన్ వెళ్తోంది. అదే నీటి కాలుష్యానికి కారణమై డయేరియా, తీవ్ర అనారోగ్యానికి దారితీసి ఉండొచ్చని అనుమానిస్తున్నాం అని మీడియాకు జాతీయ మీడియాకు చెప్పారు.
కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ల్యాబ్ నివేదిక నిర్ధరించింది. ఈ నీరు తాగడంతో వారం రోజుల వ్యవధిలోనే 10 మంది మృతి చెందారని ఇందౌర్ (Indore) మేయర్ పుష్యమిత్ర భార్గవ వెల్లడించారు. 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, అందులో చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మేయర్ చెప్పారు.



