Wednesday, May 21, 2025
Homeజాతీయంపూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్

పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చెలామణి అయిన పూజా ఖేద్కర్ కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఓబీసీ సర్టిఫికెట్ తో వికలాంగుల కోటా ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలో పాసైనట్లు చూపించి ఉద్యోగం సంపాదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పూజా ఖేద్కర్ విచారణకు సహకరించాలని కోరారు. అలాగే ఆమె డ్రగ్ లార్డ్, ఉగ్రవాది కాదని, 302 సెక్షన్ కింద నేరమేమైనా చేసిందా? ఎన్డీపీఎస్ నేరానికి పాల్పడిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్నీ కోల్పోయిందని, ఇక ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకదని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -